‘అన్‌స్టాపబుల్‌ 2’ లో ‘వీరసింహారెడ్డి’ టీం సందడి

10 Jan, 2023 13:49 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా  వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే టాక్‌ షో రెండో సీజన్‌ దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ టాక్‌ షోలో టాలీవుడ్‌ సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇటీవలే ఈ షోకి ప్రభాస్‌, గోపీచంద్‌ గెస్ట్‌లుగా వచ్చి అలరించిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి సందర్భంగా ఈ టాక్‌ షోలో వీరసింహారెడ్డి టీం సందడి చేయబోతుంది. 

ఈ విషయాన్ని ఆహా టీమ్‌ ట్వీటర్‌ ద్వారా తెలియజేస్తూ.. ‘వీరసింహారెడ్డి టీమ్ అన్‌స్టాపబుల్‌లో అడుగుపెడితే.. వీరలెవెల్ మాస్ పండుగ లోడింగ్.. ఫిక్స్ అయిపోండి, సంక్రాంతి పండగ రీసౌండ్ రావాల్సిందే!’ అని రాసుకొచ్చింది. అంతేకాదు బాలకృష్ణ, వరలక్ష్మి, గోపీచంద్ మలినేని, హనీ రోజ్‌తో పాటు మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ చిత్రాలను కూడా షేర్ చేశారు. ఇవి బాలయ్య హోస్ట్ చేసిన ఎపిసోడ్‌కు హాజరైన చిత్రాలే కావడం విశేషం.  ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ కానుకగా జనవరి 13 స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో పాటు ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న షో కామెడీ ఎక్స్‌చేంజ్‌ 6వ ఎపిసోడ్‌ కూడా  జనవరి 13న రిలీజ్‌కానుంది. 

మరిన్ని వార్తలు