Uorfi Javed: శతాబ‍్దాలుగా మహిళలను అలానే చూస్తున్నారు: ఉర్ఫీ జావేద్

18 Mar, 2023 19:03 IST|Sakshi

బాలీవుడ్ సోనాలి కులకర్ణి భారతీయ మహిళలపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రస్తుత అమ్మాయిలు సోమరిపోతులుగా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యల పట్ల మరో నటి ఉర్ఫీ జావేద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచి సంపాదన ఉన్న భర్త కావాలని కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించింది. సోనాలి మాట్లాడిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పురుషులు శతాబ్దాలుగా స్త్రీలను కేవలం పిల్లలు కనే యంత్రాలుగా చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. 

ఉర్పీ తన ట్విట్‍లో రాస్తూ..'ఆధునిక మహిళలు తమ పనితో పాటు ఇంటి పనులను కూడా చేస్తున్నారు. అలాంటి వారిని మీరు సోమరిపోతులు అని పిలుస్తున్నారా? మంచి సంపాదన ఉన్న భర్తను కోరుకోవడంలో తప్పేంటి? శతాబ్దాలుగా పురుషులు స్త్రీలను పిల్లలు కనే యంత్రంగా మాత్రమే చూశారు. వివాహానికి ప్రధాన కారణం కట్నం. మహిళలు కట్నం అడగడానికి  భయపడకండి. అవును మీరు చెప్పింది నిజమే.. మహిళలు పని చేయాలి కానీ అది అందరికీ లభించని ప్రత్యేకమైన హక్కు.'. అంటూ పోస్ట్ చేసింది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు