‘నాట్యం’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌‌ విడుదల చేసిన ఉపాసన

23 Jan, 2021 15:00 IST|Sakshi

తన స్నేహితురాలు తొలిసారిగా నటిస్తున్న ‘నాట్యం’ మూవీ ఫస్ట్‌లుక్‌ను మెగా వారి కోడలు ఉపాసన కొణిదెల విడుదల చేశారు. కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు ఈ మూవీలో లీడ్‌రోల్‌ పోషిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను శనివారం ఉపాసన విడుదల చేస్తూ.. ‘నా స్నేహితురాలు, కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు న‌టిస్తోన్న‌ తొలి సినిమా ఇది.

ఈ మూవీతో సినీరంగంలోకి అడుగుపెడుతున్న నా స్నేహితురాలిని ప్రేక్ష‌కులకు పరిచయం చేస్తున్నాను. ఈ టైటిల్‌ నాకు బాగా నచ్చింది’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఈ పోస్టర్‌లో సంధ్యారాజు కూచిపూడి న్యాట్యం చేస్తూ కనిపించారు. దర్శకడుఉ రేవంత్ కోరుకొండ రూపొందిస్తున్న ఈ సినిమాకు శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇంఉదలో నటులు కమల్‌ కామరాజు, రోహిత్ బెహల్‌లు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు