Upasana: అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్‌కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే..

16 Mar, 2023 21:06 IST|Sakshi

ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు అమెరికాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకున్నప్పటి నుంచి మెగా కపుల్‌ ఎక్కువగా అమెరికాలోనే గడుపుతున్నారు. మార్చి 13న లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్‌ ప్రదానోత్సవ కార్యక్రమానికి భర్త చరణ్‌తో పాటు ఉపాసన కూడా పాల్గొన్ని సందడి చేసింది. ఈ వేడుకలో స్పెషల్‌ డిజైనర్‌ చీర, డిఫరెంట్‌ జువెల్లరి ధరించి ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

చదవండి: నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు!

ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా చరణ్‌ అక్కడి మీడియాకు ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్‌ బిజీగా అయిపోయాడు. నాటు నాటు ఆస్కార్‌ గెలిచిన అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇండియాకు తిరిగి రాగా.. చరణ్‌-ఉపాసనలు మాత్రం లాస్‌ ఎంజిల్స్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఉపాసన లాస్‌ ఎంజిల్స్‌లో విలాసవంతమైన బంగ్లాను కొన్ని నెలల పాటు రెంట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె గర్భవతిగా ఉన్న కారణంగా అక్కడ అన్ని విధాలుగా కంఫర్ట్‌ ఉండేందుకు, అలాగే హెల్త్‌ కేర్‌లో భాగంగా ఇల్లు తీసుకున్నారట. అమెరికా వెళ్లినప్పటి నుంచి చరణ్‌-ఉపాసనలు ఆ బంగ్లాలోనే ఉంటున్నారట. ఇంకా కొన్ని రోజుల పాటు అదే ఇంట్లో ఉండనున్నట్టు సమాచారం.

చదవండి: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: యాంకర్‌ లాస్య ఎమోషనల్‌ పోస్ట్‌

వీరికి సహాయకులుగా ముగ్గురు సిబ్బందిని ఇండియా నుంచి తీసుకువెళ్లినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలిచిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం ఆ ఇంట్లోనే పార్టీ జరుపుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా వెళ్లిన రాంచరణ్, ఉపాసన చిన్న పెట్టెలో దేవుడి ప్రతిమలకు పూజ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్‌ మీడియాలో దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడంతో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. మార్చి 13న జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో నాటు నాటు సాంగ్ దేశం గర్వించే విధంగా ఆస్కార్ కైవసం చేసుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు