మరదలి పెళ్లిలో చెర్రీ సందడి.. ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

9 Dec, 2021 12:44 IST|Sakshi

మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన చెల్లెలు అనుష్ప వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చాలా కాలంగా అర్మాన్ ఇబ్రహీంను ప్రేమిస్తున్న అనుష్ప పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో కామినేని ఫ్యామిలీతో పాటు మెగాఫ్యామిలీ కూడా పాల్గొంది.  వీరిద్దరి ఎంగేజ్‏మెంట్ నుంచి మొదలు.. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మేహంది.. పెళ్లి వేడుకల వరకు ప్రతి చిన్న వేడుకకు చెర్రీ హాజరై సందడి చేశాడు.

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఈ పెళ్లి వేడుకలు మొదలైన రోజు నుంచి ప్రతి అప్డేట్ ను, ఫొటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉంది. తాజాగా పెళ్లి ఘనంగా ముగిసిదంటూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది ఉపాసన.  తన చెల్లెలు పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇది తన జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. సో మచ్ గ్రాటిట్యూడ్ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. అలాగే తన చెల్లెలు పెళ్లికి అందరూ అందించిన విషెస్, ప్రేమకు థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా ఉపాసన కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది.వాటిలో ఉపాసన, రామ్‌ చరణ్‌ గ్రాండ్‌ లుక్‌లో కలిపించి అలరిస్తున్నారు. చెర్రీ అయితే షేర్వాని ధరించి రాయల్‌ లుక్‌లో అదిరిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

మరిన్ని వార్తలు