Upcoming Movies: థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!

8 Aug, 2022 14:52 IST|Sakshi

జూలైలో బోలెడు సినిమాలు రిలీజైనా ఏ ఒక్కటీ సక్సెస్‌ అందుకోలేకపోయింది. దీంతో వరుస విజయాలు అందుకుంటున్న టాలీవుడ్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడినట్లైంది. అయితే జూలై ఉసూరుమనిపించినా ఆగస్టు తిరిగి ఊపిరి పోసింది. ఒకేరోజు రిలీజైన బింబిసార, సీతారామం రెండూ దిగ్విజయాన్ని అందుకున్నాయి. ఆ ఊపును కొనసాగించడానికి మేము రెడీ అంటూ మరి కొన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఆగస్టు రెండో వారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజ్‌ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం..

లాల్‌ సింగ్‌ చడ్డా
బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించాడు. హాలీవుడ్‌ హిట్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చై బాలీవుడ్‌ ఎంట్రీ, తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

రక్షా బంధన్‌
బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌, భూమి పెడ్నేకర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం రక్షా బంధన్‌. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ డైరెక్టర్‌. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఆగస్టు 11న రిలీజ్‌ అవుతోంది.

మాచర్ల నియోజకవర్గం
యంగ్‌ హీరో నితిన్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో కృతీశెట్టి, కేథరిన్‌ హీరోయిన్స్‌. హీరోయిన్‌ అంజలి ఐటమ్‌ సాంగ్‌లో ఆడిపాడింది. ఈ మూవీ ఆగస్టు 12న రిలీజవుతోంది.

కార్తికేయ 2
నిఖిల్‌ సూపర్‌ హిట్‌ మూవీ కార్తికేయకు సీక్వెల్‌గా వస్తోంది కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలుత ఆగస్టు 12న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అదేరోజు మాచర్ల మూవీ వస్తుండటంతో ఒకరోజు వెనక్కి జరిగారు. అంటే కార్తికేయ 2 ఆగస్టు 13న థియేటర్లలో సందడి చేయనుంది.

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు..
హాట్‌స్టార్‌
► ది వారియర్‌ - ఆగస్టు 11

అమెజాన్‌ ప్రైమ్‌
► సోనిక్‌ ది ఎడ్జ్‌హాగ్‌ 2 - ఆగస్టు 10
► ది లాస్ట్‌ సిటీ - ఆగస్టు 10
► మలయాన్‌ కుంజు - ఆగస్టు 11
► కాస్మిక్‌ లవ్‌ - ఆగస్టు 12
► ఎ లీగ్‌ ఆఫ్‌ దైర్‌ వోన్‌ - ఆగస్టు 12

ఆహా
► మాలిక్‌ - ఆగస్టు 12
► మహా మనిషి - ఆగస్టు 12
► ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ (నాలుగో ఎపిసోడ్‌) - ఆగస్టు 12

నెట్‌ఫ్లిక్స్‌
► హ్యాపీ బర్త్‌డే - ఆగస్టు 8
► నరూటో: షిప్పుడెన్‌ వెబ్‌సిరీస్‌ - ఆగస్టు 8
► ఐ జస్ట్‌ కిల్‌డ్‌ మై డాడ్‌ - ఆగస్టు 9
► ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ సీజన్‌ 2 - ఆగస్టు 10
► లాకీ అండ్‌ కీ సీజన్‌ 3 - ఆగస్టు 10
► బ్యాంక్‌ రాబర్స్‌: ది లాస్ట్‌ గ్రేట్‌ హెయిస్ట్‌ - ఆగస్టు 10
► దోతా: డ్రాగన్స్‌ బ్లడ్‌: బుక్‌ 3 - ఆగస్టు 11
► నెవ్వర్‌ హావ్‌ ఐ ఎవర్‌ సీజన్‌ 3 - ఆగస్టు 12
► బ్రూక్లిన్‌ నైన్‌-నైన్‌: సీజన్‌ 8 - ఆగస్టు 13
► గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌ - ఆగస్టు 14

సోనిలివ్‌
► గార్గి - ఆగస్టు 12

జీ5
► హలో వరల్డ్‌ వెబ్‌సిరీస్‌ - ఆగస్టు 12
►  రాష్ట్ర కవచ్‌ - ఆగస్టు 11
► బ్యూటిఫుల్‌ బిల్లో - ఆగస్టు 11
►  శ్రీమతి - ఆగస్టు 12

చదవండి: 'పచ్చళ్ల స్వాతి'గా పాయల్ రాజ్ పుత్ లుక్‌ చూశారా?
సిమ్రాన్‌ చెల్లెలి సూసైడ్‌కి ఆ కొరియోగ్రాఫర్‌కి సంబంధం ఉందా?

మరిన్ని వార్తలు