Upcoming Movies: ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే

15 Nov, 2021 14:23 IST|Sakshi

దసరా, దీపావళి వం​​టి పండుగలు వస్తే పెద్ద హీరోల సినిమాలు వెండితెరపై సందడి చేస్తాయి. ఇక మిగిలిన రోజుల్లో చిన్న, డెబ్యూ హీరోల చిత్రాలు రిలీజ్‌ అవుతుంటాయి. ఇలా ఇప్పటికే చిత్రీకరణ పూర‍్తి చేసుకున్న చిత్రాలు ఈ వారం థియేటర్‌లో సందడి చేయనున్నాయి. కొన్ని ఆసక్తికర సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ కానున‍్నాయి. అవేంటో చూద్దామా..!

1. రావణ లంక

క్రిష్‌ బండిపల్లి, అస్మిత కౌర్‌ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.ఎన్‌.ఎస్‌.రాజు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉజ్జల కుమార్‌ సాహా స్వరాలు సమకూరుస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

2. ఊరికి ఉత్తరాన

విభిన్న ప్రేమ కథా చిత్రంగా సిద్ధమైన ‘ఊరికి ఉత్తరాన’ నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నరేన్‌ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిందీ చిత్రం. 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లికాని అబ్బాయి పాత్రలో నరేన్‌ నటించారు. పలు పెళ్లి చూపులకు వెళ్లిన కథానాయకుడికి అన్ని చోట్లా నిరాశే ఎదురవుతుంది. ఈ క్రమంలో జీవితంలో ఏదైనా సాధించాలని భావించి చదువుకోవడం కోసం స్కూల్‌లో చేరిన హీరో ఎలా ప్రేమలో పడ్డాడు? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అనేదే సినిమా కథ. ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటయ్య వనపర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

3. రామ్‌ అసుర్‌

అభినవ్‌ సర్దార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పీనట్‌ డైమండ్‌’. ఇప్పుడీ టైటిల్‌ను ‘రామ్‌ అసుర్‌’గా మార్చారు. వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కగా ఎఎస్‌పి మీడియా హౌస్‌, జీవీ  ఐడియాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమని, ఇలాంటి కాన్సెప్ట్‌ ఇంత వరకు ఏ చిత్రసీమలోనూ రాలేదని, హీరో, నిర్మాత అభినవ్‌ సర్దార్‌ తెలిపారు. నవంబర్‌ 19న ‘రామ్‌ అసుర్‌’ థియేటర్‌లలో రిలీజ్‌ కానుంది.

4. స్ట్రీట్‌ లైట్‌

స్ట్రీట్‌ లైట్ సినిమాకు విశ్వ దర్శకత్వం వహించగా మామిడాల శ్రీనివాస్‌ నిర్మాత. నవంబర్‌ 19న ప్రేక‍్శకుల ముందుకు తీసుకువస్తున్నారు. నేరాలు చేసే ముఠాపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుందనేదే ఈ సినిమా కథ. మంచి ఆసక్తికరంగా సాగే చిత్రమిదని దర్శకుడు విశ్వ తెలిపారు. ఈ చిత్రంలో తాన్య దేశాయ్‌, అంకిత్‌ రాజ్‌, కావ్య రెడ్డి, వినోద్‌ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. 

5. పోస్టర్‌

విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత సోనావానే ప్రధాన పాత్రల్లో టి. మహిపాల్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పోస్టర్‌’. టి.శేఖర్‌ రెడ్డి, ఏ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మించగా, యూఎఫ్‌ఓ సంస్థ నవంబరు 19న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనుంది. ఇది చిన్న సినిమాలలో పెద్ద చిత్రమవుతుందన్న నమ్మకం ఉందని దర్శకుడు మహిపాల్‌ పేర్కొన్నారు. హీరో విజయ్‌ ధరన్‌ మాట్లాడుతూ 'ఇది మన ఊరిలో మనకి తెలిసిన కథలాగే ఉంటుంది. అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.

6. సావిత్రి వైఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి 

సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి వైఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి’. చైతన్య కొండ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరవై ఏళ్ల మహిళకు.. పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే భర్త ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబరు 19న థియేటర్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. మహేంద్ర క్రియేషన్స్‌ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించగా సత్య కశ్యప్‌ సంగీతం అందించారు. 

7. మిస్టర్‌ లోన్లీ

విక్కీ, నూరజ్‌, కీయా, లోహిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ లోన్లీ’. హరీష్‌ కుమార్‌ దర్శకుడు. కండ్రేగుల ఆదినారాయణ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఏ విధంగా మోసపోయాడు? తర్వాత అతని జీవితం ఏమైంది? అన్నది ఈ చిత్ర కథాంశం. మూడు దశల్లో నడిచే ప్రేమకథ ఇది. అమ్మాయిల చేతిలో మోసపోయిన ప్రతి అబ్బాయి కథ. ‘అర్జున్‌ రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాల్లా యువతరానికి కచ్చితంగా నచ్చుతుందని చిత్ర బృందం చెబుతోంది.

ఇక ఓటీటీల్లో రిలీజ్‌ అయే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే.

1. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

జీ5లో ఈ నెల 19 నుంచి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్‌ ప్రసారం కాబోతోంది. నిహారిక కొణిదెల నిర్మించిన సిరీస్‌ ఇది. సంగీత్‌ శోభన్‌, సిమ్రన్‌ శర్మ, తులసి, నరేష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్‌ ఉప్పల దర్శకత్వం వహించారు.

2. అద్భుతం

తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘అద్భుతం’. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించగా, ప్రశాంత్‌ వర్మ కథ అందించారు. ఈ సినిమా నేరుగా ప్రముఖ ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌’లో నవంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

3. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ 

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. లవ్‌, రొమాంటిక్‌గా వచ్చిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు.  అక్టోబరు 15న వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. నవంబరు 19న ప్రముఖ ఓటీటీ వేదికలు ఆహా, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

4. ధమకా

బాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో రామ్‌ మాధవానీ తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. మృణాల్‌ ఠాకూర్‌, అమృత సుభాష్‌, వికాస్‌ కుమార్‌, విశ్వజీత్‌ ప్రధాన కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌ 19న అలరించేందుకు సిద్ధమైంది.  వీటితో పాటు

అమెజాన్‌ ప్రైమ్‌

* నెవర్‌ బ్యాక్‌ డౌన్‌ (హాలీవుడ్‌) నవంబరు 16

* ద వీల్‌ ఆఫ్ టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) నవంబరు 19

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

* క్యాష్‌ (హిందీ) నవంబరు 19

* చురులీ (మలయాళం) నవంబరు 19

* పొన్‌ మాణిక్‌వేల్‌(తమిళం) నవంబరు 19

సోనీ లివ్‌

* యువర్‌ హానర్‌ (వెబ్‌ సిరీస్- సీజన్‌‌) నవంబరు 19

ఎంఎక్స్‌ ప్లేయర్‌

* మత్స్యకాండ్‌ (తెలుగు వెబ్‌సిరీస్‌)  నవంబరు 19

బుక్‌ మై షో

* డోంట్‌ బ్రీత్‌ 2 (తెలుగు డబ్బింగ్‌) నవంబరు 15

నెట్‌ఫ్లిక్స్‌

* టైగర్‌ కింగ్‌(వెబ్‌ సిరీస్‌-2)  నవంబరు 17

* బంటీ ఔర్‌ బబ్లీ 2(హిందీ ) నవంబరు 19

* హెల్‌ బౌండ్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 19

* కౌబాయ్‌ బే బోప్‌ (వెబ్‌ సిరీస్‌)  నవంబరు 19  

మరిన్ని వార్తలు