Upcoming Movies: థియేటర్‌లో రెండే, ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్‌కు రెడీ!

1 Aug, 2022 13:22 IST|Sakshi

వేసవి ప్రతాపం చల్లారిపోయింది. సమ్మర్‌ తర్వాత రిలీజైన పలు సినిమాలు సైతం చప్పగా ఉంటూ సినీప్రియులను ఉసూరుమనిపించాయి. దీంతో జనాలు ఆగస్టు వైపు ఆశగా చూస్తున్నారు. కనీసం ఈ కొత్త నెలలోనైనా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలున్నాయా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో చూద్దాం..

బింబిసార
నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. వశిష్ఠ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌, కేథరిన్‌ హీరోయిన్స్‌గా నటించారు. చరిత్రకు, వర్తమానానికీ ముడిపెడుతూ సాగే జానపద చిత్రమిది. ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదలవుతోంది. చాలాకాలం తర్వాత కల్యాణ్‌ బింబిసారతో పలకరించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

సీతారామం
దుల్కర్‌ సల్మాన్‌, మృణాలిని ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్‌లైన్‌. ఇందులో రష్మిక మందన్నా ముఖ్య పాత్ర పోషించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించగా అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 5న రిలీజవుతోంది.

ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు...

ఆహా
పక్కా కమర్షియల్‌  - ఆగస్టు 5
మహా - ఆగస్టు 5

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
కడువా - ఆగస్టు 4
ఆల్‌ ఆర్‌ నథింగ్‌ (వెబ్‌ సిరీస్‌) - ఆగస్టు 4
క్రాష్‌ కోర్స్‌ (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 5
థర్టీన్‌ లైవ్స్‌ - ఆగస్టు 5

నెట్‌ఫ్లిక్స్‌
డార్లింగ్స్‌ - ఆగస్టు 5
కార్టర్‌ (కొరియన్‌ చిత్రం) - ఆగస్టు 5
ద సాండ్‌మ్యాన్‌ (వెబ్‌ సిరీస్‌) - ఆగస్టు 5

హాట్‌స్టార్‌
లైట్‌ ఇయర్‌ - ఆగస్టు 3

వూట్‌
ద గ్రేట్‌ వెడ్డింగ్‌ ఆఫ్‌ మున్నీస్‌ - ఆగస్టు 4

చదవండి: నేనెప్పుడూ అలా ఫీల్‌ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా..
ఆమె సైకిల్‌ పట్టుకుంటే నేను తొక్కేవాడిని: చిరంజీవి

మరిన్ని వార్తలు