Upcoming Movies Web Series: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు..

25 Apr, 2022 12:40 IST|Sakshi

Upcoming Theatre OTT Movies Web Series In April Last Week 2022: మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సందడి పండుగల కనువిందు చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద 'కేజీఎఫ్‌ 2' వసూళ్ల పరంపర కొనసాగుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత తాజాగా విడుదలయ్యే చిత్రాలపై పడింది సినీ ప్రియుల కన్ను. మూవీ లవర్స్‌ కోసమే అన్నట్లుగా ఏప్రిల్‌ లాస్ట్ వీక్‌లో ఒక పెద్ద సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. అలాగే ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దామా !

1. ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అందులోనూ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌తోపాటు ఆయన కొడుకు రామ్ చరణ్‌ కలిసి నటిస్తున్న మూవీ అంటే.. ఆ అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 29 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు 'ఆచార్య'. 'ధర్మస్థలి' అనే ప్రాంతం చుట్టూ తిరిగే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 

2. కణ్మనీ రాంబో ఖతీజా
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్‌ సమంత, నయనతారలతో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి. చిరంజీవి 'ఆచార్య' సినిమా కంటే ఒక్క రోజు ముందుగా థియేటర్లలో తన ప్రేమాయణంతో సందడి చేయనున్నాడు ఈ హీరో. అంటే ఏప్రిల్‌ 28న ఈ మూవీ విడుదల కానుంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కాతు వాక్కుల రెండు కాదల్‌'ను తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా'గా రిలీజ్ చేస్తున్నారు. 

3. రన్‌ వే 34
బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్ దేవగణ్‌ కలిసి నటించిన చిత్రం 'రన్‌ వే 34'. ఈ సినిమాతో సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు అజయ్‌ దేవగణ్‌. ఇందులో టాలీవుడ్‌ కూల్ బ్యూటీ రకుల్‌ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్‌ అలరించనున్నారు. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్‌, అజయ్ దేవగణ్‌ పైలట్లుగా నటించగా, అమితాబ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా అలరించనున్నారు. 

4. హీరోపంతీ 2
బాలీవుడ్ యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నటించిన తాజా చిత్రం హీరోపంతీ 2. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తారా సుతారియా హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాజిద్‌ నడియద్‌వాలా నిర్మించారు. లైలా అనే విలన్‌ రోల్‌లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తన యాక్టింగ్‌ మార్క్‌ను చూపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు..

చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఇచ్చిన 10 బెస్ట్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌
గంగుబాయి కతియావాడి-ఏప్రిల్‌ 26 (తెలుగు)
365 డేస్‌: దిస్‌ డే-ఏప్రిల్‌ 27 (హాలీవుడ్‌)
మిషన్‌ ఇంపాజిబుల్‌-ఏప్రిల్‌ 29 (తెలుగు)
ఓ జార్క్‌-ఏప్రిల్‌ 29 (వెబ్‌ సిరీస్‌)
ఆక్వాఫినా ఈజ్ నోరా ఫ్రమ్‌ క్వీన్స్‌-ఏప్రిల్‌ 29 (హాలీవుడ్‌)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
అనుపమ: నమస్తే అమెరికా-ఏప్రిల్‌ 25 (హిందీ)
బ్యారీ-ఏప్రిల్‌ 25 (వెబ్‌ సిరీస్‌, సీజన్‌ 3)
మిషన్‌ సిండ్రెల్లా-ఏప్రిల్‌ 29 (హిందీ)

జీ5
నెవర్ కిస్‌ యువర్‌ బెస్ట్‌ఫ్రెండ్‌-ఏప్రిల్‌ 29 (హిందీ)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
అన్‌డన్‌-ఏప్రిల్‌ 29 (కార్టూన్‌ సిరీస్‌)

వూట్‌
బేక్డ్‌-ఏప్రిల్‌ 25 (వెబ్‌ సిరీస్‌, సీజన్ 3)
ది ఆఫర్‌-ఏప్రిల్‌ 28 (వెబ్‌ సిరీస్‌)

చదవండి:  అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు..

మరిన్ని వార్తలు