KabzaaTeaser: 25M వ్యూస్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'కబ్జా' టీజర్‌

21 Sep, 2022 16:33 IST|Sakshi

థ్రిల్లర్‌ కబ్జా ఉపేంద్ర హీరోగా, శ్రియా శరన్‌ హీరోయిన్‌గా ఆర్‌. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కబ్జా’. హీరోలు కిచ్చా సుదీప్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనున్నారు. ఆర్‌. చంద్రశేఖర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్‌ కానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ని హీరో రానా విడుదల చేశారు.

‘‘కబ్జా’ మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ. 1942 బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఇందులో పవర్‌పుల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. టీజర్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉందని ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: ఏజే శెట్టి.

మరిన్ని వార్తలు