వైరల్‌: మహేష్‌ బాబుపై క్లాప్‌ కొట్టిన బుచ్చిబాబు

20 Feb, 2021 19:27 IST|Sakshi
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటో

తొలి సినిమా ‘ఉప్పెన’తో దర్శకుడు బుచ్చిబాబు సాన సంచలనం సృష్టించారు. ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. అంతేకాదు, హీరోహీరోయిన్లు వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టిలకు కూడా తొలి సినిమాతో సూపర్‌ బ్రేక్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్లకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి. తాజాగా బుచ్చిబాబు పాత ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘1.నేనొక్కడినే’ సినిమా షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటో అది. ఆ ఫొటోలో ఓ షాట్‌కు సంబంధించి మహేష్‌‌ బాబుపై బుచ్చిబాబు క్లాప్‌ కొడుతున్నారు. ‘ఉప్పెన’ సినిమా ముందు వరకు బుచ్చిబాబు.. సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ‘1.నేనొక్కడినే’ సినిమాకు కూడా ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ( ‘ఉప్పెన’ దర్శకుడికి మరో బంపర్‌ ఆఫర్‌ )

కాగా, ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు బుచ్చిబాబుకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టైంలో ఏర్పడ్డ స్నేహంతో ఎన్టీఆర్‌ ఈ సినిమా చేయటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారంట. ఈ సినిమాను కూడా  మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ తెరకెక్కించనుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు