ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్‌ బుచ్చిబాబు ఏం చేస్తున్నాడు?

9 Sep, 2021 12:34 IST|Sakshi

ఉప్పెనతో టాలీవుడ్ కు కనీవినీ ఎరుగని డెబ్యూట్ ఇచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు. ఒక కొత్త సినిమాతో ఇటు దర్శకుడు, అటు హీరో హీరోయిన్ అందరూ,ఇండస్ట్రీ షేక్ అయ్యే హిట్ అందుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ ఇప్పటికే చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరో వైపు హీరోయిన్ కృతి శెట్టి కూడా టీటౌన్ లో లీడింగ్ యాక్ట్రెస్ గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు మాత్రం పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో దర్శకుడు బుచ్చిబాబు మూవీ కన్ ఫామ్ చేసుకున్నాడని, చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. కాని తారక్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్‌తో బిజీగా  ఉన్నాడు. ఆ తర్వాత కొరటాలతో సినిమా చేయనున్నాడు. ఆ వెంటనే కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మూవీ చేయాల్సి ఉంది.

అయితే తారక్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, బుచ్చిబాబు కోసం డేట్స్  కేటాయిస్తాను అని చెప్పాడట.కెరీర్ లో రెండో మూవీకి యంగ్ టైగర్ లాంటి టాప్ స్టార్, డేట్స్ కన్ ఫామ్ చేడయంతో వెయిట్ చేయడంలో తప్పులేదని,ప్రస్తుతానికి తాను రాసుకున్న కథకు మెరుగులు దిద్దుతున్నాడట బుచ్చిబాబు.నెక్ట్స్ ఇయర్ జులై నుంచి వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు