అయ్యో.. ‘ఉప్పెన’ కోసం బేబమ్మ ఇంత కష్టపడిందా?

11 Apr, 2021 18:53 IST|Sakshi

మేకింగ్‌ వీడియోలు విడుదల చేసిన చిత్రబృందం

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రం ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వైష్ణవ్‌ తేజ్‌ నటన, కృతిశెట్టి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామిని సృష్టించింది.

ఇక ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత మేకింగ్‌ వీడియోలని ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ‘జల జల పాతం నువ్వు’పాటతో పాటు..పలు సన్నివేశాల మేకింగ్‌ వీడియోని విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా మరో మేకింగ్‌ వీడియోని విడుదల చేసింది. అందులో డైలాగ్స్‌ చెప్పడానికి ‘బేబమ్మ’ఎంత కష్టపడిందో చూడొచ్చు. మీడియా ముందు సైలెంట్‌గా కనిపించే దర్శకుడు బుచ్చిబాబు..లొకేషన్‌లో మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు క్లాస్‌రూమ్‌ సీన్లను ఎలా చిత్రీకరించారో ఈ వీడియోలో చూడొచ్చు.
 


చదవండి:
‘జలజల పాతం’‌ మేకింగ్‌ కష్టాలు, వీడియో వైరల్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు