‘వీడు ముసలోడు అవ్వకూడదే’

13 Jan, 2021 18:20 IST|Sakshi

మెగా వారసుడు వైష్ణవ్‌ తేజ్, హీరోయిన్‌ కృతీ శెట్టి హీరోహీరోయిన్‌లు దర్శకుడు బచ్చిబాబు సనా రూపొందించిన చిత్రం ‘ఉప్పెన’. ఇప్పటికే విడుదలైన ఈ  చిత్రంలోని పాటలు, మోషన్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైష్ణవ్ తేజ్‌‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఉప్పెన టీజర్‌ విడుదల చేసింది. నిమిషం నిడివి గల ఈ టీజర్‌లోనే సినిమా ఎలా ఉండబోతుందనేది దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ప్రతి సినిమా కథ లాగే పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి మధ్య సాగే ప్రేమకథ ఇది.
(చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్‌.. మెస్మరైస్‌ చేసిన దేవిశ్రీ)

ఇక టీజర్‌ విషయానికోస్తే.. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో తెలుస్తుంది కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది.. అని హీరో చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అని చెప్పే హీరోయిన్ ఆకట్టుకుంటుంది. ఇందులో వైష్ణవ్‌ మీసాలు తిప్పుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి ఉప్పెన గతేడాది వేసవిలో విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేయాలని చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించినా.. థియేటర్లు తెరుచుకొవడంతో సినిమాను బిగ్‌స్క్రీన్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు