వరంగల్‌లో ఉప్పెన టీం సందడి

23 Feb, 2021 09:47 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ చౌరస్తా : ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమా హీరో వైష్ణవ్‌తేజ్‌ , హీరోయిన్‌ కృతిశెట్టి వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్‌లోని రాధికా థియేటర్‌లో చిత్రం విడుదల కాగా, సోమవారం సాయంత్రం హీరో, హీరోయిన్లతో పాటు ఇతర చిత్రబృందం ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అలాగే, సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి తదితరులు హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. వారితో ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పూజలు చేయించి ఆశీర్వదించారు.

అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళ విశేషాలను వివరించారు. ఆ తర్వాత వైష్ణవ్‌తేజ్‌ మాట్లాడుతూ అల్లు అర్జున్‌ నటించిన రాణిరుద్రమదేవి సినిమా ద్వారా కాకతీయ రాజుల గొప్పతనం తెలిసిందని తెలిపారు. అలాగే, వరంగల్‌లోని భద్రకాళి గుడిని కూడా సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. అర్చకులు టక్కరసు సత్యంసురేష్‌శర్మ, సుధాకరశర్మతో పాటు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, లింగబత్తిని రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు