ఆ ఫోటోలు,వీడియోలు డిలీట్‌ చెయ్‌.. లేకపోతే చంపేస్తాం.. హాట్‌ బ్యూటీకి బెదిరింపులు

31 Oct, 2023 16:03 IST|Sakshi

సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది బాలీవుడ్‌ భామ ఉర్ఫీ జావెద్‌.  విచిత్రమైన వేషధారణతో ఫోటో షూట్‌ చేసి..వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే కొన్నిసార్లు అవి వివాదానికి దారి తీస్తుంటాయి. తాజాగా ఈ బిగ్‌బాస్‌ భామకు హత్యా బెదరింపులు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఫోస్ట్‌ చేసిన ఫోటోలు డిలీట్‌ చేయకపోతే.. చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే ఎక్స్‌ వేదికగా చెప్పింది. 

అసలేం జరిగింది?
విచిత్ర వేష‌ధార‌ణ‌తో ట్రెండింగ్‌లో నిలిచే మోడ‌ల్‌, న‌టి ఉర్ఫీ జావేద్. నిత్యం ఏదో ఒక విచిత్రమైన డ్రెస్‌తో ఫోటోషూట్‌ చేసి వాటిని తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేయడం ఆమెకు అలవాటు. అలా తాజాగా భూల్‌ భులయ్యలోని ఛోటా పండిత్‌ క్యారెక్టర్‌ డ్రెస్‌ ధరించి.. ఫోటోషూట్‌ చేసింది. అంతేకాదు అదే గెటప్‌లో ఓ పార్టీకి కూడా హాజరైంది. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. 

చంపేస్తామని బెదరింపులు
వింత ఫ్యాషన్‌తో విమర్శలకు కేంద్రబిందువుగా మారే ఉర్పీకి ఛోటా పండిత్‌  గెటప్‌ లేనిపోని తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఛోటా పండిత్‌ గెటప్‌లో పార్టీకి హాజరవ్వడం పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ మతాన్ని కించపరిచేలా చేస్తున్నావని, ఇలాగే కంటిన్యూ చేస్తే చంపేస్తామని కొంతమంది ఆమెను బెదరిస్తున్నారట. అంతేకాదు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫోటోలు, వీడియోలను డిలీట్‌ చేయలని, లేదంటే చంపడం తమకు పెద్ద పనే కాదంటూ బెదిరింపు మెయిల్స్‌ పంపిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ఉర్ఫీకి ఇలాంటి బెదిరింపులు రావడం పరిపాటే. గతంలో కూడా అనేకసార్లు ఉర్ఫీకి ఈ తరహా బెదిరింపులు వచ్చాయి.

మరిన్ని వార్తలు