‘భారతదేశపు నిజమైన ప్రజలకు ధన్యవాదాలు’

19 Sep, 2020 14:54 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ ఇటీవల‌ కాంగ్రెస్ నాయ‌కురాలు, సినీయర్‌ నటి ఉర్మిలా మటోండ్కర్‌ను అసహాస్యం చేస్తూ ‘సాఫ్ట్‌ పోర్నో స్టార్’గా ‌ అంటూ సంచలన వ్యాఖ్యల చేసిన అనంతరం తనకు మద్దతు నిచ్చిన సినీ ప్రముఖులకు ఆమె శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ముంబై వివాదం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఊర్మిళ, కంగనాల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో కంగనా, ఉర్మిలాపై చేసిన వ్యాఖ్యలపై వివాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత అనుభవ్‌ సిన్హా, నటుడు స్వరా భాస్కర్లతో సహా పలువురు నటీనటులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఊర్మిలా 25 సంవత్సరాల సినీ జీవితంలో తన లాంటి వ్యక్తిని చూడలేదని, దయ, జాలితో పాటు మంచి వ్యక్తిత్వం ఉన్న నటి అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ కంగనాపై విరుచుకుపపడ్డారు. దీంతో ఈ సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ఊర్మిలా ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: గ‌ట్టిగా అరిస్తే అన్నీనిజాలు అయిపోతాయా ?)

‘‘నాకు మద్దతుగా నిలిచిన భారతదేశపు నిజమైన ప్రజలకు’ ధన్యవాలు. నిష్పాక్షికమైన, గౌరవప్రదమైన మీడియాకు కృతజ్ఞతలు. ఇది నకిలీ ప్రచారం, ట్రోల్స్‌పై విజయం. జైహింద్‌’ అంటూ ట్విట్‌ చేశారు. అయితే ఇటీవల ముంబైపై చేసిన కంగనా అనుచిత వ్యాఖ్యలపై  ఉర్మిలా ఘాటుగా స్పందించారు. కంగనా తనేదో బాదితులురాలిన హైడ్రామాలాడుతుందని, ముంబైని పాకిస్తాన్‌ అక్రమిత కశ్మీర్‌గా పిలిచిన కంగనా తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌ మాదకద్రవ్యాలకు మూలం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ ఘూటుగా స్పందించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఓ ఇంటర్యూలో కంగనా ఆమెను సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌గా పిలిచిన విషయం తెలిసిందే. అంతేగాక జయబచ్చన్‌ వద్ద ఆమె షాట్లు కూడా తీసుకుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా