హీరోయిన్‌ కడుపులో ట్రైనర్‌ పిడిగుద్దులు.. వీడియో వైరల్‌

12 Jun, 2021 12:02 IST|Sakshi

ముంబై: సినిమాలో నటించేవాళ్లు కొందరైతే,జీవించేవాళ్లు మరికొందరు ఉంటారు.  క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఏం చెయ్యడానికైనా వెనుకాడరు. కొన్ని పాత్రల కోసం ముందే రోజుల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్‌ నటి, మాజీ మిస్‌ ఇండియా(యూనివర్స్‌) ఊర్వశి రౌటేలా మరో అడుగు ముందుకేసింది. తన తదుపరి చిత్రం కోసం ఏకంగా బాక్సింగ్‌ పంచులను సైతం భరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓ యాక‌్షన్‌ ఫిల్మ్‌ కోసం ఊర్వశీ ట్రైనింగ్‌ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె ట్రైనర్‌ కడుపులో పిడి గుద్దులు కురిపిస్తుంటే, ఆ నొప్పిని భరిస్తూ ట్రైనర్‌ పనితనాన్ని దగ్గరినుంచి గమనిస్తుంది. దీనికి  సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..నో పెయిన్.. నో గెయిన్‌ అనే క్యాప్షన్‌ను జోడించింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఊర్వశీ డెడికేషన్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కోసం ఇంత కష్టపడుతున్న ఊర్వశీకి హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఊర్వశి ప్రస్తుతం "ద బ్లాక్‌ రోజ్‌"లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం "తిరుట్టు పాయలే 2" హిందీ రీమేక్‌లోనూ నటించనుంది. హీరో శరవణన్‌ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తూ తమిళంలోనూ ఎంట్రీకి రెడీ అవుతోంది. బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్‌ హుడాతో "ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌" అనే వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. "మర్‌ జాయేంగే" మ్యూజిక్‌ వీడియోలో గురు రంధవాతో ఆడిపాడనుంది.

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela)

చదవండి : సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్‌ అనిత
క్రికెట్‌ చూడను కానీ సచిన్,‌ కోహ్లి అంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు