కోహ్లి ఫోటో షేర్‌ చేయడంలో ఆమె ఉద్దేశం ఏంటో..?

17 Mar, 2021 20:10 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి, మాజీ మిస్‌ ఇండియా(యూనివర్స్‌) ఊర్వశి రౌటేలా తన తల్లి పంపిన ఓ ఫోటో యొక్క ఉద్దేశం కనుక్కోవడం కోసం తన ఫాలోవర్స్‌ సాయాన్ని కోరింది. తల్లి మీరా రౌటేలాకు తనకు మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా జరిగిన ఓ సంభాషణలో తల్లి మీరా ఆమెకు ఓ ఫోటోను షేర్‌ చేసింది. అందులో టీమిండియా సారధి విరాట్‌ కోహ్లి చిన్నతనంలో తల్లికి వంటింట్లో సాయపడుతూ కనిపిస్తాడు. అయితే తన తల్లి ఆ ఫోటోను తనకెందుకు పంపిందో, అందులో ఆమె ఉద్దేశం ఏంటో, అసలు తన తల్లి తన నుంచి ఏం కోరుకుంటుందో అర్ధంకావడం లేదని.. ఈ విషయంలో సాయపడాలని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తనకు అభిమానులు  అభ్యర్ధించింది. తల్లికి తనకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన గ్లిమ్సస్‌ను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులకు అర్ధమైంది తనకు వ్యక్తపరచాలని కోరింది. 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela)

అయితే ఊర్వశి షేర్‌ చేసిన కోహ్లి ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరైతే.. అందులో నీకు అర్ధంకాకపోయ్యేంత మిస్టరీ ఏముందో అంటూ వ్యంగ్యంగా సమాధానమివ్వగా, మరికొందరేమో.. నీ తల్లి కిచెన్‌లో నీ సాయం కోరుకుంటుందని, అందుకే ఆమె కోహ్లి.. తల్లికి సాయపడుతున్న ఫోటోను పంపిందని సందేశాలు పంపారు. తల్లి పంపిన ఫోటోకు ఫాలోఅప్‌గా ఊర్వశి మరో ఫోటోను షేర్‌ చేసింది. అందులో ఆమె తన తల్లి ఉద్దేశాన్ని గ్రహించి, కిచెన్‌లో సాయపడటానికి వస్తున్నానంటూ.. తను వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లే ఫోటోను పంపింది. కాగా, 2019 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి మైనపు బొమ్మతో దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు