‌‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్‌లో బాలీవుడ్‌ భామ!

26 Jan, 2021 13:55 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియోటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మండన్న నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ తొలిసారి పూర్తిస్థాయి మాస్‌ రోల్‌లో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. (ఆ హీరోయిన్‌ నా లక్కీ చామ్‌: అల్లు అర్జున్‌)

కాగా  ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించేందుకు  బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలాని చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఊర్వశి సైతం వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.  ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీ కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చే ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. (బర్త్‌డే స్పెషల్‌: రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలు)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు