సర్కారు వారితో పాట

25 Jan, 2021 05:21 IST|Sakshi

మహేశ్‌బాబు నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుంది. ఈ పాటలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్టెప్‌ వేయబోతున్నారని తెలిసింది. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌ జంటగా రూపొందనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌కు ఊర్వశీ రౌటేలాను సంప్రదించారట. తమన్‌ అందించిన ఈ మ్యాస్‌ ట్యూన్‌కి మహేశ్, ఊర్వశి స్టెప్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తాయని టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు