నటి వజ్రాల మాస్కు: ధర చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

12 Apr, 2021 17:10 IST|Sakshi

హిందీ ఐటమ్‌సాంగ్స్‌కు తనదైన స్టైల్‌లో ఆడిపాడి జనాలకు కిక్కెక్కించే భామ ఊర్వశి రౌతేలా. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలని తహతహలాడే ఈ మిస్‌ ఇండియా బ్యూటీ తాజాగా ఓ వెరైటీ మాస్క్‌తో జనాలకు షాకిచ్చింది. అదేంటీ.. మాస్కు మంచిదే కదా.. అందులో షాకింగ్‌ ఏముంది అంటారా? అక్కడికే వస్తున్నాం.. 

సాధారణంగా మాస్కు రూ.10 ఉంటుంది. లేదంటే వందల్లో ఉంటుంది. కరీనా కపూర్‌ వంటి బాలీవుడ్‌ సెలబ్రిటీలు అయితే వేలు ఖర్చుపెట్టి మాస్కులు కొనుక్కుంటారు. కానీ ఊర్వశి మాత్రం వందలు, వేలు, లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లు విలువైన మాస్కు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ముక్కు, నోటికి కాకుండా తల మొత్తాన్ని కప్పివేస్తున్నట్లుగా ఉంది. ఈ డైమండ్‌ మాస్క్‌ ధర రూ.3 కోట్ల రూపాయలట. ధరే కాదు దాని బరువు కూడా ఎక్కువగానే ఉందని క్యాప్షన్‌ ఇచ్చింది ఊర్వశి.

ఈ మేరకు ఓ చిన్నపాటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇదిలా వుంటే ఊర్వశి ప్రస్తుతం "ద బ్లాక్‌ రోజ్‌"లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం "తిరుట్టు పాయలే 2" హిందీ రీమేక్‌లోనూ నటించనుంది. హీరో శరవణన్‌ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తూ తమిళంలోనూ ఎంట్రీకి రెడీ అవుతోంది. బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్‌ హుడాతో "ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌" అనే వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. "మర్‌ జాయేంగే" మ్యూజిక్‌ వీడియోలో గురు రంధవాతో ఆడిపాడనుంది.

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela)

చదవండి: 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు