నాటక కళాకారులను గుర్తుతెచ్చే ‘ఉత్సవం’

22 May, 2022 17:22 IST|Sakshi
ఉత్సవం చిత్ర యూనిట్‌

నాటక కళా రంగం గొప్పదనం గురించి తెలియజేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా దీలీప్‌, రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్‌, నాజర్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు.

త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల కానుంది. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడని,  కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ అద్భుతమైన విజువల్స్‌తో ‘ఉత్సవం’ను అందంగా తీర్చిదిద్దారని చిత్ర యూనిట్‌ పేర్కొంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు