Ashwin Babu: మెడికో థ్రిల్లర్‌.. యంగ్ హీరో ప్రయోగం

2 Aug, 2023 00:28 IST|Sakshi

అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మామిడాల ఎంఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఆలూరి సురేష్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్టు 1) అశ్విన్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ‘‘మెడికో థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అశ్విన్‌ ఫిజికల్‌గా మేకోవర్‌ అయ్యారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, సంగీతం: గౌర హరి.

మరిన్ని వార్తలు