నటుడి రెండో పెళ్లి: మాజీ భార్య స్పందన

18 Feb, 2021 15:56 IST|Sakshi

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలీవుడ్‌ కపుల్‌ వైభవ్‌ రేఖీ-దియా మీర్జాల పెళ్లి ఫొటోలే తారసపడుతున్నాయి. వీరికిది రెండో పెళ్లి. దియా ఇదివరకే నిర్మాత సాహిల్‌ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకోగా 2019లో భర్తతో విడాకులు తీసుకుంది. ఇటు వైభవ్‌ కూడా గతంలో సునైన రేఖీతో ఏడడుగులు వేశాడు. కానీ వీళ్ల బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. దీంతో అతడు దియాకు దగ్గరై, ప్రేమించి ఫిబ్రవరి 15న ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. తాజాగా ఈ పెళ్లి గురించి వైభవ్‌ మాజీ భార్య, యోగా నిపుణురాలు సునయన స్పందించింది.

"నా పేరు సునయన రేఖీ. బహుశా నా పేరు మీరు ఇదివరకు వినే ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య వార్తల్లో నా పేరు తరచూ వినిపిస్తోంది. అవును, నా మాజీ భర్త దియాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నాకు కుప్పలుతెప్పలుగా మెసేజ్‌లు వస్తున్నాయి. నేను, నా కూతురు సమీరా ఎలా ఉన్నామంటూ ఆందోళనపడుతున్నారు. మీ ప్రేమకు థ్యాంక్స్‌. మేమిద్దరం బాగానే ఉన్నాం. మాకు బాంబేలో ఎవరూ లేరు అనుకునేవాళ్లుం. కానీ ఇప్పుడు వీరి పెళ్లితో సమీరా కుటుంబం పెద్దదైంది. తన జీవితంలో ప్రేమ చాలా అవసరం. ఆమె ఇప్పటివరకు తన తల్లి, తండ్రి మధ్య ప్రేమను చూడకలేకపోతే ఇకనుంచైనా దాన్ని చూసి ఆస్వాదిస్తుంది. ఆ ప్రేమ, మమకారాలను తను కూడా ఒడిసి పట్టుకుని ముందుకు సాగుతుంది. సమీరా, ఆమె తండ్రి వైభవ్‌, దియా.. ఈ ముగ్గురి వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్పుకొచ్చింది.

చదవండి: రెండో వివాహం.. ట్రెండ్‌ సెట్‌ చేసిన నటి

అమీర్‌ఖాన్‌ సినిమా నుంచి తప్పుకున్న విజయ్‌ సేతుపతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు