వైకుంఠ ఏకాదశి రోజున..

14 Sep, 2020 06:39 IST|Sakshi

‘నరసింహా, నరసింహ నాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్‌’ వంటి హిట్‌ చిత్రాలకు కథ అందించిన రచయిత చిన్నికృష్ణ తాజాగా రాసిన కథతో తెరకెక్కనున్న చిత్రం ‘వైకుంఠ ఏకాదశి రోజున..’. చిన్నికృష్ణ స్టూడియోస్‌ సమర్పణలో బిల్వా క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్‌ నంబర్‌ 1గా రూపొందనున్న ఈ చిత్రాన్ని చిన్నికృష్ణ, ఆయన తనయుడు ఆకుల చిరంజీవి నిర్మించనున్నారు. హైదరాబాద్‌లోని చిన్నికృష్ట ఆఫీసులో ఆయన కుమార్తె ఆకుల ఊర్మిళాదేవి జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా రచయిత–నిర్మాత చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య అద్భుతమైన అమృత ఘడియలుగా పెద్దలు నిర్ణయించారు. 1850వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ముహూర్తం రాలేదు. ఇలాంటి అరుదైన ముహూర్తంలో మా సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తెలుగు–కన్నడ వెర్షన్లకు ఒక దర్శకుడు, తమిళం–మలయాళం వెర్షన్లకు ఒక దర్శకుడు, హిందీ వెర్ష¯Œ కు మరో దర్శకుడు పని చేయనున్నారు. ఆయా భాషల్లో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వారందరి పేర్లు త్వరలో చెబుతాం. ఫస్టాఫ్‌ కథ గోవాలో, సెకండాఫ్‌ కాశీలో జరుగుతుంది. నా ఐదేళ్ల కష్టానికి ఫలితం ఈ కథ. కరోనా వ్యాప్తి తగ్గాక షూటింగ్‌ మొదలు పెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్‌ ప్రసాద్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు