వైష్ణవ్‌ తేజ్‌, క్రిష్‌ సినిమా: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. టైటిల్‌ అదేనా!

17 Aug, 2021 16:55 IST|Sakshi

తొలి సినిమా ‘ఉప్పెన’తోనే  బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్‌తేజ్‌. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్‌ హీరో.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.ఉప్పెన’సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌. ఇక తన రెండో సినిమాకి ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహించాడు. అడవి నేపథ్యంలో సాగే ఈ మూవీని ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.
(చదవండి: అధ్యక్ష భవనంలో తాలిబన్ల జల్సాలు.. ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్‌)

తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్ర బృందం. అక్టోబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మవీ.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకుంటుంది. ఈ మూవీ టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘కొండపొలం’అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా అదే పేరుని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
(చదవండి: క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా?)

మరిన్ని వార్తలు