మరోసారి ‘బేబమ్మ’తో వైష్ణవ్‌ తేజ్‌ రొమాన్స్‌!

17 Apr, 2021 15:47 IST|Sakshi

చిత్రపరిశ్రమలో కాంబినేషన్‌కి భారీ రెస్పాన్స్‌ ఉంటుంది. ఒక సినిమా హిట్‌ అయితే చాలు ఆ దర్శకుడికి, హీరో కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటారు సినీ అభిమానులు. అలాగే హీరో, హీరోయిన్లు కూడా మరోసారి కలిసి నటిస్తే..ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అందుకే దర్శక, నిర్మాతలు సైతం అలాంటి జోడీలతో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. ప్రేక్షకులు కూడా అలాంటి జోడీలను ఆదరిస్తుంటారు.

ఇటీవల కాలంలో సిల్వర్ స్క్రీన్‌పై బాగా పాపులర్‌ అయిన జోడీ ఏదైనా ఉంటదే.. అది వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టిలదే. ‘ఉప్పెన’లో వీరిద్దరు చేసిన రొమాన్స్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చింది. వైష్ణవ్‌, కృతిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో ఈ ఇద్దరికి వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. అందం, అభినయంతో ప్రతి ఒక్కరి మనసును దోచుకున్న ఈ ‘బేబమ్మ’.. మరోసారి వైష్ణవ్‌తో జోడీ కట్టనున్నందని టాక్‌. ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్, కృతితో కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ సినిమాతో సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌ మూడో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలోనటించిన తన రెండో సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇక కృతిశెట్టి విషయానికి వస్తే.. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో పాటు సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేగాక, రామ్‌ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు