Ranga Ranga Vaibhavanga Movie: వైష్ణవ్​ తేజ్​ 'కొత్తగా లేదేంటి ?' ప్రొమో విడుదల..

4 May, 2022 14:55 IST|Sakshi

Vaishnav Tej Ranga Ranga Vaibhavanga Movie Song Promo Release: మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్​ తేజ్​ మొదటి చిత్రం 'ఉప్పెన'తోనే పెద్ద హిట్​ అందుకున్నాడు. తర్వాత కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్​ సింగ్​తో కలిసి 'కొండపొలం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాల్లో వైష్ణవ్​ తేజ్​ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వైష్ణవ్​ తేజ్​ నటిస్తున్న చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో 'రొమాంటిక్'​ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్​గా యాక్ట్ చేస్తోంది. 

మెడికల్​ స్టూడెంట్స్ మధ్య వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీలోని 'కొత్తగా లేదేంటి ?' అనే లిరికల్ సాంగ్​ ప్రొమోను రిలీజ్​ చేశారు. పూర్తి పాటను మే 6న విడుదల చేయనున్నారు మేకర్స్​. శ్రీమణి రాసిన ఈ సాంగ్​ను ఆర్మన్ మాలిక్​, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్​ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటుంది. 

చదవండి: 'రంగ రంగ వైభవంగా' ఫస్టు సింగిల్ రిలీజ్

మరిన్ని వార్తలు