Chiranjeevi-Vaishnav Tej: ఆ సీన్‌ చేసేటప్పుడు నవ్వాను, చిరు మామ సీరియస్‌ అయ్యారు

24 Aug, 2022 14:58 IST|Sakshi

‘ఉప్పెన’లో ఆ పాట చేసేటప్పుడు ఇబ్బంది పడ్డా: వైష్ణవ్‌ తేజ్‌

శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెనతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుని ఒక్కసారిగా దర్శక-నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొండపొలంతో మరో హిట్‌ అందుకున్న వైష్ణవ్‌ ప్రస్తుతం రంగ రంగ వైభవంగా అనే మరో ప్రేమకథ చిత్రంలో నటిస్తున్నాడు. గిరీశయ్యా దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవ్‌ డైరెక్టర్‌ గిరీశయ్యాతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. 

చదవండి: సౌందర్యతో అలాంటి రిలేషన్‌ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్

ఈ సందర్భందగా శంకర్‌ దాదాలో మీ పెద్ద మామయ్య(మెగాస్టార్‌ చిరంజీవి)తో కలిసి నటించావ్‌ కదా ఆయన నీకు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారా? అని అడగ్గా.. ‘ఈ సినిమాలో నా పాత్ర అసలు కదలకూడదు, కల్లు అర్పకూడదు. అయితే ఒక సీన్‌లో బాగా నవ్వేశాను. దీంతో మామయ్య(చిరంజీవి) అప్పుడు కొంచ్ం సీరియస్‌ అయ్యారు’ చెప్పాడు.  ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్‌, గ్యాదరింగ్‌ అయితే తేజ్‌ అంటే అందరు ఒకేసారి తిరిగి చూస్తారా? అడిగారు హోస్ట్‌. దీనికి ‘‘చిరు మామ ఓరేయ్‌ అని పిలిస్తే చాలు.. మేమంతా పలుకుతాం. ఇక ఉప్పెన స్క్రీప్ట్‌ను మొదట నా ఫ్రెండ్స్‌తో కలిసి విన్నాను. ఆ తర్వాత సుకుమార్‌, మైత్రి మూవీ మేకర్స్‌ ఈ కథను చిరంజీవి మామయ్యకు వినిపించారు.

చదవండి: తారక్‌ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు

‘ఐడియా బాగుంది.. సినిమా తీయండి’ అని ఆయన అన్నారు’’ అని చెప్పుకొచ్చాడు. ఉప్పెన మూవీలోని రొమాంటిక్‌ సాంగ్‌(జల జల జలపాతం నువ్వు) చేసేటప్పుడు ఇబ్బంది పడ్డానన్నాడు. చూట్టు వందమంది ఉన్నారని, అంతమంది ముందు ఎలా చేయాలా? అనిపించదన్నాడు. ఈ సినిమాలో ఓ సీన్‌ చేసేటప్పుడు తాను నిజంగా ఏడ్చానని, బేబమ్మ నీకో మాట చెప్పాలనే సన్నివేశానికి దాదాపు 20పైనే టేక్‌ తీసుకున్నానన్నాడు. అది చేసేటప్పుడే అందరి సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నానని గుర్తు రాగానే కన్నీళ్లు వచ్చాయన్నాడు. ఇక చిన్న మామయ్య(పవన్‌ కల్యాణ్‌) తమ్ముడు, బద్రి సినిమాలను తాను సుమారు 120 సార్లు చూశానని వైష్ణవ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు