ఆ రోజు ప‌వ‌న్ అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా

28 Aug, 2020 18:37 IST|Sakshi

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం వ‌కీల్ సాబ్‌. ఇది బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన 'పింక్' సినిమాకు రీమేక్ అన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వ‌కీల్ సాబ్ మోష‌న్ టీజ‌ర్‌ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌చ్చింది. ఆయ‌న పుట్టిన రోజు తెలుసు క‌దా.. సెప్టెంబ‌ర్ 2. అభిమానుల‌కు అది పండ‌గ రోజు కూడా! అదే రోజు మోష‌న్ టీజ‌ర్‌ను వ‌దిలి అభిమానుల‌కు బ‌ర్త్‌డే ట్రీట్ ఇచ్చేందుకు వ‌కీల్ సాబ్ యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది. అస‌లే రెండేళ్ల విరామం త‌ర్వాత ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇస్తుండ‌టంతో సినిమా నుంచి వ‌చ్చే అప్‌డేట్ కోసం క‌ళ్లలో వ‌త్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. (చ‌ద‌వండి: అన్నయ్య చేయిపట్టి పెరిగాను.. పవన్‌ భావోద్వేగం)

ఈ క్ర‌మంలో ఆయ‌న పుట్టిన రోజు, టీజ‌ర్‌ విడుద‌ల ఒకే రోజు కావ‌డంతో, రెండింటిని ట్రెండ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో మోత మోగిస్తామంటున్నారు అభిమానులు. అందుకోసం ఇప్ప‌టినుంచే కౌంట్ డౌన్ కూడా ప్రారంభించారు. కాగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ప‌వ‌న్ న్యాయం కోసం కోర్టులో వాదిస్తున్న ఫొటోతో పాటు, షూటింగ్‌‌ ఫొటోలు కూడా లీకై, వైర‌ల్ అయిన విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. వ‌కీల్ సాబ్ సినిమాను దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు. (చ‌ద‌వండి: పవన్‌ సినిమా.. నన్నెవరూ కలవలేదు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా