‘వకీల్‌ సాబ్‌’తో నా కల నెరవేరింది: తమన్‌

21 Mar, 2021 10:44 IST|Sakshi

‘‘వకీల్‌ సాబ్‌ ’ సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్‌ చేశాం.. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకూ అదే అనుభూతి కలుగుతుంది’’ అని దర్శకుడు వేణు శ్రీరామ్‌ అన్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వకీల్‌ సాబ్‌ మ్యూజికల్‌ ఫెస్ట్‌ను నిర్వహించారు.

వేణు శ్రీరామ్‌ మాట్లాడుతూ– ‘‘పవన్‌ కల్యాణ్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. ‘వకీల్‌ సాబ్‌’కు మంచి సంగీతం ఇచ్చిన తమన్‌కు, అద్భుతమైన లిరిక్స్‌ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రికి థ్యాంక్స్‌. ఈ సినిమా మీ అందరి అంచనాలు అందుకునేలా ఉంటుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ మాట్లాడుతూ– ‘‘పవన్‌ కల్యాణ్‌కి నేను పెద్ద అభిమానిని. మణిశర్మగారి దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ‘ఖుషి’, ‘గుడుంబా శంకర్‌’, ‘బాలు’ చిత్రాలకు పనిచేశాను. ఆయన సినిమాకు సంగీతం అందించడం నా కల. అది ‘వకీల్‌ సాబ్‌’తో నెరవేరినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్స్‌ హారిక నారాయణ, పృథ్వీ, దీపు, శ్రీ కృష్ణ, సాహితీ, సుభ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: 
హీరోయిన్‌ కనబడుట లేదు: డోంట్‌ వర్రీ అంటున్న పోలీసులు
కొత్త డైరెక్టర్‌తో మహేశ్‌ మూవీ.. కానీ, ఓ షరతు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు