భర్తతో వనితా విజయ్‌ కుమార్‌కు విభేదాలు!

22 Oct, 2020 10:24 IST|Sakshi

చెన్నై: తన భర్త మద్యానికి బానిసయ్యాడని నటి, బిగ్‌బాస్‌ ఫేం వనితా విజయకుమార్‌ ఆరోపించింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిన ఆమె ఇటీవల పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారు. తాజాగా పీటర్‌ పాల్‌తో కూడా వనితా విజయ్‌కుమార్‌కు విభేదాలు తలెత్తినట్లు, వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ సంచలన జంట ఇటీవల విహారయాత్రకు గోవాకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గొడవ మొదలైంది. దీంతో చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత నటి వనితా విజయకుమార్‌ మూడవ భర్తను కూడా వదిలేసినట్లు ప్రచారం హోరెత్తుతోంది. చదవండి: వనితా విజయకుమార్‌ భర్తకు గుండెపోటు 

ఈ విషయంపై స్పందించిన  వనిత విజయకుమార్‌ ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో ఆమె.. ‘పీటర్‌పాల్‌ మద్యానికి పచ్చి బానిసని, చైన్‌ స్మోకర్’‌ అని ఆరోపించారు. అతనికి రెండు సార్లు గుండెపోటు రావడంతో రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అదృష్టవశాత్తు పీటర్‌ పాల్‌కు ఆరోగ్యం బాగుపడిందని, అయితే మళ్లీ మద్యం తాగుతున్నట్లు ఆరోపించారు. మద్యానికి దూరంగా ఉంటానని తనకు ప్రమాణం చేసి కూడా తాగడం ఆపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తానీ నిర్ణయానికి వచ్చినట్లు వనితా విజయకుమార్‌ వివరించారు.చదవండి: ‘సైఫ్‌ను చాలా ప్రేమిస్తున్నాను.’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు