Vanitha Vijayakumar: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి.. దానివల్ల భయంగా ఉందంటూ..

24 Sep, 2023 14:14 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే! హీరోయిన్‌ ప్రియా బాజ్‌పేయ్‌, కల్పికా గణేశ్‌ సైతం మయోసైటిస్‌తో పోరాడుతున్నట్లు ఆ మధ్య వెల్లడించారు. వారిలాగే తాను కూడా ఓ అరుదైన వ్యాధితో పోరాడుతున్నానంటోంది నటి వనితా విజయ్‌ కుమార్‌.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చాలా ఏళ్ల నుంచి క్లాస్ట్రోఫోబియాతో సతమతమవుతున్నట్లు పేర్కొంది. దీనివల్ల చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండాలంటేనే భయమేస్తోందని చెప్పుకొచ్చింది. లిఫ్ట్‌, వాష్‌రూమ్‌ వంటి చిన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండలేనంది. కిటికీలు లేని గదుల్లో, జన సమూహాల్లో ఊపిరాడని భావనను ‘క్లాస్ట్రోఫోబియా’ అంటారు. గతంలో సంపూర్ణేశ్‌ బాబు సైతం బిగ్‌బాస్‌ షోలో ఈ భావనతో బాధపడ్డాడు.

ఇకపోతే తమిళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది వనితా విజయ్‌కుమార్‌. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై నటిగా సత్తా చాటుతోంది. ఆమె కూతురు జోవిక సైతం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ముంబైలోని అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిపాటు శిక్షణ సైతం తీసుకుంది.

A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar)

చదవండి: ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు, గుర్తింపు రావట్లేదని చనిపోదామనుకున్నా

మరిన్ని వార్తలు