సింగిల్‌ అంటూ కన్నుకొట్టిన వనితపై నెటిజన్‌ ఫైర్‌, నటి చురకలు

10 Jun, 2021 12:35 IST|Sakshi

మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో సంచలన నటిగా ముద్ర వేసుకున్నారు వనిత విజయ్‌ కూమార్‌. గత ఏడాది తమిళ బిగ్‌బాస్‌ రియాలిటీ షో సీజన్‌ 3లో పాల్గొని వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత గతేడాది జూన్‌లో పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. ఎదిగిన కూతుళ్ల ముందే మూడో పెళ్లి చేసుకోవడం, ముద్దులు పెట్టడమేంటని కొంచమైన బుద్ది ఉండాలంటు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అయితే ఆ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు.

పీటర్‌ పాల్‌ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనిత విజయ్‌ కుమార్‌ను రెండో పెళ్లి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అలా మూడో పెళ్లి పెటాకులైన కొన్ని రోజులకు వనిత మరో పోస్ట్ చేశారు. మళ్లీ ప్రేమలో పడ్డానంటూ ఓ పోస్ట్ చేశారు. కానీ దానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో వనిత మరో పెళ్లి, రిలేషన్ అంటూ నెటిజన్లు తన రిలేషన్‌పై రూమర్లు క్రియేట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.

తాజాగా ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ ‘తాను సింగిల్ అని, అందరికీ అందుబాటులోనే ఉన్నాను’ అంటూ కన్నుకొడుతూ ఓ పోస్ట్ షేర్‌ చేశారు. అది చూసి దీనిపై ఓ నెటిజన్ భగ్గుమన్నారు. అలా సింగిల్ అని చెప్పడం అందుబాటులోనే ఉన్నానని అనడం ఏంటి? బాధ్యత లేదా? మీకు ఎదిగిన పిల్లలున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక వనిత సదరు నెటిజన్‌పై మండిపడుతూ.. ‘ఎలా ఉండాలో నాకు తెలుసు.. నీ బతుకు నీ బతుకు. నాకు అవసరం ఉంటే నువ్వొచ్చి ఏమీ పెట్టడం లేదు కదా?.. నా నటన నచ్చితే నా వీడియోలు చూడు లేదంటే నీ పని నువ్ చూసుకో’ అంటూ చురకలు అంటించారు.

చదవండి: 
మళ్లీ ప్రేమలో పడ్డా 
కరోనా దేవి.. అచ్చం నటి వనిత విజయకుమార్‌ మాదిరిగానే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు