వరలక్ష్మీ శరత్‌కుమార్‌ లేటెస్ట్‌ మూవీ 'ఆద్య' షూటింగ్‌ ప్రారంభం

11 Jan, 2022 08:46 IST|Sakshi

ఆశిష్‌ గాంధీ, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రధారులుగా ఎమ్‌ఆర్‌ కృష్ణ మామిడాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆద్య’. డి.ఎస్‌.కె. స్క్రీన్స్‌ సమర్పణలో పి.ఎస్‌.ఆర్‌. కుమార్, ఎస్‌. రజనీకాంత్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది.

‘‘సాయిలక్ష్మి క్రియేషన్స్‌ పతాకంపై ‘షికారు’ తర్వాత బాబ్జీ నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ‘ఆద్య’. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా కథాంశం ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. విశ్వ కార్తీక్, హెబ్బా పటేల్, కన్నడ కిశోర్, అమితా రంగనాథన్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సహనిర్మాత: పి.సాయి పవన్‌కుమార్‌. 

మరిన్ని వార్తలు