మధుబాల ఆన్‌ సెట్‌

16 Dec, 2021 05:38 IST|Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’. ఈ సినిమా ద్వారా హరి–హరీష్‌ దర్శకులుగా పరిచయమవుతున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్‌ జానర్‌లో ఆకట్టుకునేలా తీస్తున్న చిత్రం ‘యశోద’. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 6న ప్రారంభమైంది.

ఇందులో కీలకమైన మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కనిపిస్తారు. బుధవారం నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ నెల 23 వరకూ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ చేస్తాం. జనవరి 3న రెండో షెడ్యూల్‌ మొదలవుతుంది. మార్చికి సినిమాను పూర్తి చేస్తాం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.

మరిన్ని వార్తలు