నా అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి

4 Dec, 2020 05:54 IST|Sakshi

సెలబ్రిటీల సోషల్‌ మీడియా అకౌంట్లు అప్పుడప్పుడు హ్యాక్‌కు గురవడం చూస్తుంటాం. వారి ఖాతాల్ని హ్యాక్‌ చేసి అభ్యంతరకరమైన సందేశాలు, ఫొటోల్ని పోస్ట్‌ చేస్తుంటారు హ్యాకర్లు. తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘‘బుధవారం రాత్రి నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను హ్యాక్‌ చేశారు. ఈ కారణంగా వాటిలో నేను పోస్టులు పెట్టలేకున్నాను. నా ఖాతాలను పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందాలతో సంప్రదింపులు జరుపుతున్నాను. వీటి పునరుద్ధరణకు కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు నా సోషల్‌ మీడియా ఖాతాలో ఏవైనా పోస్టులు వస్తే వాటి పట్ల ఫాలోయర్లు జాగ్రత్తగా ఉండాలి. నా అకౌంట్లు పునరుద్ధరణ అయిన తర్వాత నేనే అభిమాలకు తెలియజేస్తాను’’ అని వరలక్ష్మి తెలిపారు.

మరిన్ని వార్తలు