1990లోనే నాకు పోటీగా ఒక నటుడొచ్చాడు!

26 Dec, 2022 07:00 IST|Sakshi
అభిమానులతో సెల్ఫీ తీసుకుంటున్న విజయ్‌ 

వారీసు ఆడియో రిలీజ్‌ వేడుకలో హీరో విజయ్‌  

నటుడు విజయ్‌ కథానాయకుడిగా న టించిన తాజా చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో సంక్రాంతికి బరిలోకి నిలవనుంది. ఇందులో రషి్మక మందన్న నాయకిగా నటించారు. శరత్‌ కుమార్, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నటి రష్మికా మందన్నా ముంబాయ్‌ నుంచి వచ్చారు. ఈమె వేదికపై నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ తో కలిసి రంజితమే పాటకు స్టెప్స్‌లు వేసి సందడి చేశారు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ తాను విజయ్‌ వీరాభిమానినన్నారు. ఆయన చిత్రానికి పని చేయాలని 27 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఇప్పుడు ఎవరెస్ట్‌ శిఖరాన్ని టచ్‌ చేసినట్లు ఉందని అన్నారు. ఇండియాకు ఆధార్‌ కార్డు ఎంత ముఖ్యమో విజయ్‌ చిత్రంలోని పాటలను కంపోజ్‌ చేయటం అంత ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో శింబు, అనిరుధ్‌ పాటలు పాడడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

అలా అంటే కరుణానిధి ఆశ్చర్యపోయారు.. 
నటుడు శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ తాను నటించిన సూర్యవంశం 175వ వేడుకలో భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ అని చెప్పానని, అది తెలిసిన కరుణానిధి ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు విజయ్‌ పెద్ద సూపర్‌ స్టార్‌ అని వ్యాఖ్యానించారు. 

విజయ్‌ నంబర్‌–1 హీరో  
నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ వారీసు రీమేక్‌ కాదు. పక్కా తమిళ చిత్రం అని తెలిపారు. ఇది తెలుగు, తమిళంలోనే కాదు ఉత్తరాదిలోనూ సూపర్‌ హిట్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పొంగల్‌ మనదే అని పేర్కొన్నారు. విజయ్‌ నటుడుగానే కాదు నిజజీవితంలోనూ సూపర్‌ స్టారే అని అన్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అభిమానులు నంబర్‌–1 అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో దిల్‌రాజు కూడా నంబర్‌–1 అంటూ వారిని ఉత్సాహపరిచారు. నటి రష్మిక మాట్లాడుతూ తాను విజయ్‌ అభిమానిని పేర్కొన్నారు. ఆయన నటించిన గిల్లీ చిత్రాన్ని తన తండ్రితో కలిసి చూశానని, అప్పటి నుంచి ఆయన నటనను డైలాగ్‌ డెలివరీని ఇమిటేషన్‌ చేయడం మొదలెట్టానన్నారు.

మీకు నచ్చిన నటుడు, మీ క్రష్‌ ఎవరని అడిగితే విజయ్‌ అని చెబుతానన్నారు. చివరిగా నటుడు విజయ్‌ మాట్లాడుతూ 1990లోనే ఒక నటుడు తనకు పోటీగా వచ్చారన్నారు. కొద్దిరోజులు ఆయన తనకు ïపోటీగా నిలిచారన్నారు. ఆయన సక్సెస్‌ కారణంగా తాను వేగంగా పరిగెత్తాల్సి వచ్చిందన్నారు. ఆయన కంటే ఎక్కువగా విజయం సాధించాలని భావించాలన్నారు. అలా ప్రతి ఒక్కరికి పోటీ దారుడు అవసరం అని పేర్కొన్నారు. తన పోటీదారు పేరు జోసెఫ్‌ విజయ్‌ అన్నారు (ఇది విజయ్‌ అసలు పేరు). అలా ఎవరికి వారు.. తమను తమకే పోటీగా భావించి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అభిమానులకు సూచించారు.   

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు