SS Thaman Crying Video: థియేటర్‌లో ఏడ్చేసిన తమన్‌, వీడియో వైరల్‌

11 Jan, 2023 21:01 IST|Sakshi

దళపతి విజయ్‌ హీరోగా నటించిన చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరిట రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. కానీ తమిళంలో మాత్రం ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న సమయానికి అంటే నేడే(జనవరి 11న) రిలీజైంది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో తెలుసుకుందామని డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌ రాజు, సంగీత దర్శకుడు తమన్‌.. చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు.

అక్కడ అభిమానుల స్పందన చూసి ఎమోషనలైన థమన్‌ కంటతడి పెట్టుకున్నాడు. ఇక దిల్‌ రాజు అయితే కాలర్‌ ఎగరేసి మరీ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు హీరోయిన్‌ త్రిష సైతం తన ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూసినట్లు తెలుస్తుండగా రష్మిక కూడా వారిసు మూవీని ఎంజాయ్‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే వారీసు తొలిరోజు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.12 కోట్ల మేర డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: కారు ప్రమాదం.. నటి బతకడం కష్టమన్న డాక్టర్స్‌
రామ్‌చరణ్‌ వీరసింహారెడ్డి చూస్తాడేమో: చిరంజీవి

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు