బన్ని బ్లాక్‌ చేశాడంటూ ట్వీట్‌.. రాత్రి పెగ్గేస్తూ వివరణ ఇచ్చిన హీరోయిన్‌

19 Mar, 2023 14:02 IST|Sakshi

అల్లు అర్జున్‌ తనను ట్విటర్‌లో బ్లాక్‌ చేశాడంటూ నిన్నంత రాద్దాంతం చేసింది భాను శ్రీ మెహ్రా. దీంతో ఆమె పేరు ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు బన్ని ఎందుకు ఆమెను బ్లాక్‌ చేశాడని నెటిజన్లు తెగ ఆరా తీశారు. అయితే కాసేపటికే  బన్ని మనసు మార్చుకొని అన్‌బ్లాక్‌ చేశాడంటూ మరో ట్వీట్‌ చేసి అందరిని కన్‌ఫ్యూజ్‌ చేసింది. అంతేకాదు తానేమీ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసేందుకు ట్వీట్ చేయలేదని, తనను ఎప్పుడూ బ్లేమ్ చేయలేదని భాను శ్రీ చెప్పుకొచ్చింది. అయితే బన్ని ప్యాన్స్‌ మాత్రం అప్పటికే భానుశ్రీపై ఫుల్‌ ఫైర్‌ అయ్యారు. అనవసరంగా తమ హీరోని బ్లేమ్‌ చేస్తున్నావంటూ ఆమెను ట్రోల్‌ చేయడం మొదలెట్టారు.

దీంతో భానుశ్రీ మరోసారి వివరణ ఇచ్చింది. బన్ని అభిమానులను హర్ట్‌ చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చింది.  ఈ రోజంతా కూడా వింతగా జరిగింది. అంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించింది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేందుకు ఆ ట్వీట్ చేయలేదు.  నేను కూడా బన్నీకి పెద్ద ఫ్యాన్‌నే. నా కెరీర్‌ను చూసి నేను నవ్వుకుంటాను. నా బాధలు చూసి నేనే నవ్వుకుంటున్నాను. ప్రేమను పంచుదాం.. ద్వేషాన్ని వద్దు’ అంటూ ఓ పెగ్గేస్తూ అందరికి గుడ్‌నైట్‌ చెప్పింది. ప్రస్తుతం భానుశ్రీ ట్వీట్‌ నెట్టింట్‌ వైరల్‌ అవుతుంది. 

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘వరుడు’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది భానుశ్రీ మెహ్రా. తొలి సినిమా తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. హీరోయిన్‌ పాత్రలు లభించకోవడంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారింది.

మరిన్ని వార్తలు