‘వరుడు కావలెను’ సినిమాను బ్యాన్‌ చేయాలి 

8 Aug, 2021 08:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ (నిజాంపేట్‌) :  ‘వరుడు కావలెను’ సినిమాను బ్యాన్‌ చేయాలని కోరుతూ శనివారం బాచుపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ  సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర చౌదరి మాట్లాడుతూ ఈ సినిమాలో ‘దిగు దిగు దిగు నాగ’ పాట హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

అనంతరం తహసీల్దార్‌ సరితకు మెమోరాండమ్‌ అందజేసి తమ నిరసనను తెలియజేశారు.  బాచుపల్లి మండల అధ్యక్షుడు నరేష్‌గుప్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి శివ కోటేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీ చింతకింది వంశీకృష్ణ, సోషల్‌ మీడియా కన్వీనర్‌ శివ కుమార్, మాతృశక్తి విభాగం మండల నాయకురాలు  ధర్మపురి అనిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు