ఒక మహిళ కథను మరో మహిళే చెప్పగలదు: పూజా హెగ్డే

24 Oct, 2021 07:39 IST|Sakshi

‘‘ఇండస్ట్రీలో మహిళా దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. ఒక మహిళ కథను మరో మహిళే చక్కగా చెప్పగలదు. లక్ష్మీగారికి ‘వరుడు కావలెను’ సినిమాతో మంచి సక్సెస్‌ రావాలి. నాగశౌర్య సెల్ఫ్‌మేడ్‌ యాక్టర్, హార్డ్‌ వర్కర్‌. అలా కష్టపడే తత్త్వాన్ని కచ్చితంగా గౌరవించాలి. ఈ సినిమా రూపంలో రీతూకు మరో మంచి హిట్‌ రావాలి. ‘వరుడు కావలెను’ వంటి సినిమాలను థియేటర్స్‌లో ఫ్యామిలీతో చూడాలి’’ అని హీరోయిన్‌ పూజా హెగ్డే అన్నారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సంగీత్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నా ఫ్యామిలీ బ్యానర్‌. ఈ సినిమాతో చాలా డబ్బులు, మరింత గౌరవం రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మన కుటుంబం బాగుంటుందని, చాలా మంచిదని మనం ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. ఈ సినిమా బాగా వచ్చిందని నేను అంతే గర్వంగా చెబుతున్నాను. ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీ సౌజన్యగారు మంచి కథ రాసుకుని ఈ సినిమా చేశారు. ఆమె కష్టానికి తగిన ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది... బ్లాక్‌బాస్టర్‌ కొడుతున్నాం. శేఖర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నిర్మాతలు చినబాబు, సూర్యదేవర నాగవంశీ.. సినిమాలను ప్రేమించే వ్యక్తులు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు టైమ్‌ పడుతుంది. అందుకే ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు నాగశౌర్య. ఈ కార్యక్రమంలో నిర్మాత చినబాబు, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు