Varun Dhawan: హైదరాబాద్ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది

19 Nov, 2022 17:54 IST|Sakshi

‘హైదరాబాద్‌ నాకు సొంత ఇల్లులా ఉంది. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది’అని బాలీవుడ్‌ స్టార్‌ వరుణ్‌ ధావన్‌ అన్నారు. వరుణ్‌ ధావన్‌, కృతిససన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేదియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్‌ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. 

ఈ సందర్భంగా వరుణ్‌ ధావన్‌ మాట్లాడుతూ..‘ హైదరాబాద్‌ నాకు సొంత ఇల్లు లా ఉంది. ఒక దర్శకుడు కొడుకుగా సినిమా నా బ్లడ్ లోనే ఉంది. మేము ఎప్పుడు సినిమాల గురించే చర్చించుకుంటాం. ఓన్లీ హిందీ సినిమాలు మాత్రమే కాదు మేము తెలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడకుంటాం.ఇండియాలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ముంబై , హైదరాబాద్ కి చెందిన వాళ్ళే. మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్ లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా. తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. 

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేసాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్ గా మారింది. వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూసే అవకాశం నాకు కలిగింది. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రమోట్ చెయ్యడానికి చిరంజీవి గారు వస్తాను అన్నారు కానీ ఆయనకు ఒక కాంబినేషన్ లో షూటింగ్ ఉండడంతో రాలేకపోయారు. ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను’ అన్నారు. ‘నా కెరియర్ టాలీవుడ్‌ నుంచే స్టార్ట్‌ చేశాను. నా మొదటి సినిమాకే మంచి లవ్ ఇచ్చారు. అలానే తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది మరోసారి మీ ప్రేమను అందివ్వండి ’అని కృతి సనన్ అన్నారు.

మరిన్ని వార్తలు