కాలం కలిసొస్తే ఈ ఏడాదే పెళ్లి

9 Jan, 2021 17:02 IST|Sakshi
ప్రేయసి నటాషాతో వరుణ్‌ ధావన్‌

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ పెళ్లి గురించి రెండేళ్ల నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. రేపో మాపో లేదా వచ్చే నెలలో వివాహం జరుగుతుంటూ ఊరిస్తూనే ఉన్నారు. ఎలాగో తన ప్రేయసి నటాషా దలాల్‌ ఉండనే ఉంది కాబట్టి బయట అడుగు పెడితే చాలు పెళ్లెప్పుడు అన్న ప్రశ్న బాణంలా దూసుకొస్తోంది. దీంతో వరుణ్‌ తన పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెడతారనే విషయాన్ని వెల్లడించారు. రెండేళ్ల నుంచి ప్రతి ఒక్కరూ నా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు గందరగోళంగా ఉంది. కాస్త పరిస్థితులు చక్కబడి కాలం కలిసొస్తే తప్పకుండా ఈ ఏడాదే నటాషాతో ఏడడుగులు వేస్తాను అని చెప్పుకొచ్చారు. (చదవండి: రికార్డుల మోత మోగిస్తున్న కేజీఎఫ్‌ 2 టీజర్‌)

ఇక వరుణ్‌ తాజాగా నటించిన చిత్రం కూలీ నెం.1లో హీరోయిన్‌ సారా అలీఖాన్‌ను ప్రేమలో పడేయడానికి ఆయన చాలా వేషాలే వేశారట. అయితే రియల్‌ లైఫ్‌లో కూడా నటాషాను ప్రేమకు ఒప్పించడానికి ముప్పుతిప్పలు పడ్డారట. మూడు, నాలుగు సార్లు నటాషా అతడి ప్రపోజల్‌ను రిజెక్ట్‌ చేసిందట. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా నటాషాను ప్రేమలో పడేసి దాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లుతున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్‌ మాత్రమే కాదు.. అటు రణ్‌బీర్‌-అలియా జంట కూడా ఇదివరకే వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంది. కానీ సడన్‌గా వచ్చిన కరోనా మహమ్మారి వల్ల వారు కూడా లవ్‌ బర్డ్స్‌గానే ఉండిపోయారు. అయితే ఎలాగైనా త్వరలోనే పెళ్లిపీటలెక్కుతామని చెప్పారు. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్‌ చేసింది: కానీ, నమ్మకంతో..)

మరిన్ని వార్తలు