వరుణ్‌- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?

8 Jun, 2023 19:09 IST|Sakshi

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలయింది అని ఉదయం నుంచి ప్రధాన మీడియా నుంచి సోషల్‌ మీడియా వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అని. లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థానికి రేపు (జూన్‌ 9)న ముహూర్తం ఖరారు అయినట్లు ఇండస్ట్రీ పీఆర్ టీమ్‌లు కూడా ఇప్పటికే చెప్పుకొచ్చాయి. దీంతో ఉదయం నుంచి మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషిగా ఉన్నారు.

(ఇదీ చదవండి: వారి లిస్ట్‌ తీయండి.. ఫ్యాన్స్‌కు హీరో అదేశం)

అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే.. ఇండస్ట్రీలోని అందరూ చెబుతున్నారు  కానీ ఈ పెళ్లిపై వరుణ్ తేజ్ కుటుంబం కానీ, లావణ్య త్రిపాఠి కుటుంబం కానీ అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పెళ్లి చేసుకోబోతున్న జంట కూడా ఇప్పటి వరకు స్పందించ లేదు. అసలు మెగా కాంపౌండ్‌లో ఏం జరుగుతుంది అనేది ఫ్యాన్స్‌లో ఉత్కంఠ ఏర్పడింది.  కానీ.. చిరంజీవి, నాగబాబులలో ఎవరో ఒకరు అయినా పెళ్లి గురించి అధికారికంగా స్పందిస్తే బావుంటుందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

(ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌)

మరిన్ని వార్తలు