‘లూసిఫర్‌’ రీమేక్‌లో కీలక పాత్రలో వరుణ్‌ తేజ్!?

5 Jun, 2021 08:56 IST|Sakshi

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇంకా 20 రోజుల షెడ్యూల్‌ మాత్రమే  మిగిలి ఉంది. ఇదిలా ఉండగా చిరంజీవి ఇప్పటికే మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసిన సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ కాగా మరోకటి మలయాళ హిట్‌ చిత్రం ‘లూసిఫర్’. ఆచార్య చిత్రం అయిపోగానే చకచక ఈ చిత్రాలను పట్టాలెక్కించేందుకు చిరు ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అయితే తమిళ రీమేక్‌ ‘లూసిఫర్‌’ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన ప్రతి న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘లూసిఫర్‌’లో చిరుకు చెల్లిగా స్వీటీ అనుష్క నటించనుందనే వార్త ఇటీవల తెగ హల్‌చల్‌ చేసింది. అంతేగాక ప్రారంభం నుంచే, యంగ్‌ పోలిటిషియన్‌గా విజయ్‌ దేవరకొండ ఈ మూవీలో దర్శనం ఇవ్వనున్నాడనే టాక్‌ కూడా వచ్చింది. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని విజయ్‌ దేవరకొండ స్పష్టం చేశాడు.  ఇక తాజా బజ్‌ ప్రకారం ఈ పాత్రలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ను ఈ మూవీలోకి తీసుకొనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ సినిమాలో ఏ పాత్ర చేయడానికైన మెగా హీరోలు ఆసక్తిగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇదే నిజమైతే పెద్దనాన్న మూవీలో నటించేందుకు వరుణ్‌ కచ్చితంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజున లూసిఫర్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. మోహన్ రాజా ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు