నవంబర్‌లో షురూ

24 Sep, 2020 01:25 IST|Sakshi

కొత్త సినిమా కోసం బాక్సర్‌గా మారారు వరుణ్‌ తేజ్‌. ఒక్క షెడ్యూల్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది. నవంబర్‌లో మళ్లీ బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టనున్నారు వరుణ్‌. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుంది. సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా బ్రేక్‌ తర్వాత నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు.

నవంబర్‌ 2 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. నవంబర్‌ నుంచి మార్చి వరకూ ఏకధాటిగా చిత్రీకరణ జరపాలన్నది ప్లాన్‌ అట. ఈ సినిమా కోసం ప్రపంచప్రఖ్యాత బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ వద్ద నెలరోజుల పాటు బాక్సింగ్‌ మెళకువలు నేర్చుకోవడంతోపాటు బాడీలాంగ్వేజ్‌ మీద దృష్టిపెట్టారు వరుణ్‌. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు