Varun Tej : ఫస్ట్‌ పంచ్‌ విసిరిన ‘గని’.. ఆకట్టుకుంటున్న వరుణ్‌

6 Oct, 2021 19:52 IST|Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ మెగా హీరో బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడదులైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా ఆ సినిమా నుంచి గని ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్‌. 

ఇందులో వరుణ్‌ రక్తమోడుతూ పంచ్‌ విసిరాడు. బాక్సర్‌గా బాడీని పూర్తిగా ట్రాన్స్‌ఫామ్‌ చేసుకున్న ఈ కుర్ర హీరో లుక్‌ ఆకట్టుకునేలా ఉండి.. అంచనాలను ఇంకా పెంచింది.  అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ  నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించింది. కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ మూవీని డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్‌. ‘గద్దలకొండ గణేశ్‌’ తర్వాత వరుణ్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

చదవండి: రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌.. మామూలుగా ఉండదుగా

మరిన్ని వార్తలు