వరుణ్ తేజ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఇదే

19 Jan, 2021 10:42 IST|Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ మూవీ సినిమా టైటిల్‌తో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ‘గని’అని టైటిల్‌ ఖరారు చేశారు. బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లు కొడుతున్న వ‌రుణ్ లుక్‌ని మోషన్‌ పోస్టర్‌లో చూపించారు. 
(చదవండి : తేజ కొత్త సినిమా.. అలిమేలు ఆవిడే!)

ఈ చిత్రంలో హీరో పేరు గని అందుకే సినిమాకి కూడా అదే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా ఇందులో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఈ పాత్రలో స్టార్ హీరో ఉపేంద్ర చేయనున్నాడు.  వ‌రుణ్ తేజ్ కి కోచ్ గా.. సునీల్ శెట్టి, ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నాడు. అందాల రాక్ష‌సి ఫేమ్… న‌వీన్ చంద్ర‌కు కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు